ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 1,824 కర్ణాటక మద్యం ప్యాకెట్లు సీజ్​

అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 1,824 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

seb officials seized  Karnataka liquor
కర్ణాటక మద్యం ప్యాకెట్లు సీజ్​ చేసిన ఎస్​ఈబీ అధికారులు
author img

By

Published : Apr 16, 2021, 10:29 AM IST

అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో మద్యం అక్రమ రవాణాపై ఎస్​ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 1,824 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం రవాణాకు ఉపయోగించిన కారు, ఆటో, ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్​ చేశామని చెప్పారు.

పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్లో ఒకరు ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్​, మరొకరు వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తే.. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదనన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రూ.1.32 లక్షల విలువైన మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.