అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో మొహరం వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్సీలకు మరో వర్గానికి చోటు చేసుకున్న వివాదంలో బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎస్సీ సంఘాలు ధర్నా చేశారు. గ్రామంలో దళితుల్ని అవమానించినందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై పోలీసులు ఉదాసీనత చూపిస్తున్నారని పలు ప్రజా సంఘాలు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నిందితుల్ని పట్టుకుంటామని చెప్పినందున వారు విరమించుకున్నారు.
ఇదీ చదవండి: