ETV Bharat / state

Puttaparthi Sai: ఘనంగా సత్యసాయి 96వ జయంతి వేడుకలు - Satya sai trust

పుట్టపర్తిలో సత్యసాయిబాబా 96వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాలస్వామి రథోత్సవంతో కన్నుల పండుగగా మొదలయ్యాయి. భక్తుల గీతాలాపన, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల వైభవంగా మహోత్సవం జరిగింది.

Puttaparthi Sai
ఘనంగా సత్యసాయి 96వ జయంతి వేడుకలు ప్రారంభం
author img

By

Published : Nov 18, 2021, 7:39 PM IST

పుట్టపర్తిలో సత్యసాయిబాబా 96వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.వేణుగోపాలస్వామి రథోత్సవంతో కన్నుల పండుగగా మొదలయ్యాయి. భక్తుల గీతాలాపన, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వైభవంగా మహోత్సవం ప్రారంభమయ్యింది.

సత్యసాయి 96వ జయంతి వేడుకలు 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. గురువారం వేణుగోపాల స్వామి రథోత్సవం భక్తులు నిర్వహించారు. 19న మహిళా దినోత్సవం, 22న సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరై విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. 23వ తేదీ సత్యసాయి 96వ జయంతి ముగింపు వేడుకలు జరుగనున్నాయి.

ఈ వేడుకలను తిలకించడానికి వేలాదిమంది భక్తులు పుట్టపర్తికి తరలి వస్తున్నారు.కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ట్రస్ట్ వర్గాలు ఏర్పాట్లు చేపట్టారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని వివిధ రంగుల పుష్పాలతో అలంకరించి భక్తజనం ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు.

ఇదీ చదవండి : WOMAN MURDER: వివాహిత దారుణ హత్య...భర్తే హంతకుడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.