ETV Bharat / state

ఊరిపై మమకారం.. నిలిచింది పేరు చిరకాలం! - Ruled for years as sarpanches news

ఆ గ్రామస్థులంతా ఒకే మాటపై ఉంటారు.. ఒక్కటిగా నడుస్తారు.. అభివృద్ధే లక్ష్యంగా సాగుతారు. ఇలాంటి వారి మద్దతు చూరగొన్న కుటుంబాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పల్లె ప్రజలంతా దశాబ్దాల తరబడి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఊరు నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారూ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రజల గుండెల్లో స్థానం పొంది.. పల్లెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆ కుటుంబాల ప్రత్యేకత ఇది.

enagaluru village
ఇనగలూరు గ్రామం
author img

By

Published : Feb 4, 2021, 2:04 PM IST

అనంతపురం జిల్లా అగళి మండలంలోని ఇనగలూరు గ్రామ సర్పంచులుగా 34 ఏళ్ల పాటు ఒకే కుటుంబానికి పట్టం కట్టారు. ఎనిమిది గ్రామాలు ఏకమయ్యాయి, అభివృద్ధికి ఐక్యంగా నిలిచారు. పలు మార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిట్ట చివరి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యార్థి ఓటమి చవిచూశారు.

ప్రజలే బలం:

అగళి మండలంలోని ఇనగలూరు పంచాయతీ 1956లో ఏర్పాటు చేశారు. పాపేగౌడు కుటుంబం పేరు ప్రతిష్టలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి. పాపేగౌడు 22 ఏళ్లుగా సర్పంచి పదవిలో సాగారు. నరసింహగౌడు తొలి సర్పంచిగా 1956లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1966లో పాపేగౌడు సోదరుడు లక్ష్మీనరసేగౌడు రెండో గ్రామ సర్పంచిగా, 1968 నుంచి 1990 వరకు వరుసగా 22 ఏళ్లుగా పాపేగౌడు సర్పంచిగానే ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వంతో పోరాడి ఇనగలూరు గ్రామానికి 600 ఇళ్లను కట్టించారు. పాపేగౌడు కుమారుడు గిరీష్‌గౌడు ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సమయత్తం అవుతున్నారు.

సర్పంచి ఎన్నికల్లో వారికి ఎదురేది...!

father and son
సంవత్సరాలుగా సర్పంచి పదవిలో ఉన్న తండ్రీకుమారుడు

తలుపుల మండలంలోని ఓబుళరెడ్డిపల్లి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి సర్పంచి ఎన్నికల్లో వీరికే పట్టం కడుతున్నారు. టీవీఆర్‌ ఆంజనేయులు శెట్టి 40ఏళ్లు పాటు ఆ పంచాయతీ సర్పంచిగా కొనసాగారు. రిజర్వేషన్ల తరువాత ఒక సారి మాత్రమే పంచాయతీ స్థానం బీసీలకు దక్కింది. మరోసారి వివాదాస్పదంగా ఎన్నిక సాగింది. ఆంజనేయులు శెట్టి అనంతరం అతని కుమారులు విజయకుమార్, జయరాములు పదేళ్ల పాటు సర్పంచిగా గెలుపొందారు. సర్పంచి ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా గ్రామంలో వారిదే ఆధిపత్యం. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఓబుళరెడ్డిపల్లి మీదుగా గాండ్లపెంటకు వెళ్తూ గ్రామంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు పెద్దగా రాకపోవడంతో సర్పంచిపై ఆయన ఆరాతీశారు. ఈసారి బీసీ మహిళలకు రిజర్వుడ్‌ కావడంతో వారి తరఫున బీసీ అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆంజనేయులు శెట్టి వంశీయులే స్థలదానం చేశారు.

తరతరాలుగా..!

sarpanch
తరతరాలుగా ఒక కుటుంబసభ్యులే సర్పంచులు

రామగిరి మండలంలోని పోలేపల్లి పంచాయతీ అభివృద్ధిలో దిశగా సాగుతోంది. 44వ జాతీయ రహదారికి 9 కిలోమీటర్ల దూరంలో ఎన్‌.ఎస్‌.గేటు-పేరూరు ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. పంచాయతీ పరిధిలో పోలేపల్లి, అక్కంపల్లి, పాపిరెడ్డిపల్లి, చెర్లోపల్లి గ్రామాలు ఉన్నాయి. పోలేపల్లి పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందినవారు 54 ఏళ్లు సర్పంచులుగా కొనసాగుతుండటం ఓ ప్రత్యేకత. పంచాయతీ ఆవిర్భావం చెందిన తరువాత మొదటి సర్పంచిగా పెద్దిరెడ్డి చెన్నప్ప తరువాత ఆయన కుమారుడు పెద్దిరెడ్డి అంజినప్ప తరువాత ఆయన కుమారుడు పెద్దిరెడ్డి చంద్రశేఖర్‌ అనంతరం బీసీ రిజర్వేషన్‌ రావడంతో ఐదు సంవత్సరాలు శ్రీరాములు అనంతరం పెద్దిరెడ్డి చంద్రశేఖర్‌ భార్య పెద్దిరెడ్డి లక్ష్మీదేవి కొనసాగారు. పంచాయతీ 2013లో ఎస్సీ రిజర్వేషన్‌కు రావడంతో ముత్యాలమ్మ సర్పంచిగా ఎన్నిక అయ్యారు. గ్రామాల్లో సిమెంట్‌ రహదారులు, తాగునీటి సమస్య పరిష్కారం, పంచాయతీ భవన నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామానికి ఉన్నత పాఠశాల ఏర్పాటుకు పెద్దరెడ్డి చంద్రశేఖర్‌ కృషిచేశారు. తిరిగి ఈ ఏడాది జనరల్‌ మహిళకు రావడంతో గ్రామంలో పంచాయతీ ఎన్నికలు వేడెక్కాయి.

తరగని పరపతి..!

యాడికి మండల పరిధిలోని వేములపాడుకు చెందిన వీకే కుటుంబంలో నలుగురికి ఆరు పర్యాయాలు పంచాయతీ పాలకులుగా ఆ గ్రామ ప్రజలు అవకాశం కల్పించారు. మొదటి తరంలో నారాయణరెడ్డి ఒకసారి, రెండో తరంలో వీకే వెంకట్రామిరెడ్డి మూడు పర్యాయాలు, మూడో తరంలో వీకే విశ్వనాథరెడ్డి ఒకసారి, నాలుగో తరంలో వీకే ప్రదీప్‌ రెడ్డి ఒకసారి పంచాయతీకి ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఊరంతా ఒకే మాట, ఒకే బాట అనే భావనలో ఉండేవారని, గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గ్రామపెద్దలంతా ఏకగ్రీవాల వైపే మొగ్గు చూపేవారని మాజీ సర్పంచి వీకే విశ్వనాథరెడ్డి చెబుతున్నారు. వేములపాడు, కొట్టాలపల్లి, తిమ్మాపురం, వి.పెండేకల్లు గ్రామాల కలయికగా ఏర్పడిన వేములపాడు పంచాయతీలో 2,094 మంది ఓటర్లున్నారు.

వరుస విజయాలతో..

sarpanch members
అభివృద్ధికి పాటు పడుతూ సర్పంచులుగా గెలుపు

విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెంది పాటిల్‌ వీరన్నగౌడ్‌ సర్పంచి వ్యవస్థ ఏర్పడిన మొదటి ఎన్నికలు మినహా వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, 23 సంవత్సరాలు సర్పంచిగా సేవలందించారు. ఆ గ్రామానికి ఉన్నత పాఠశాల వచ్చేలా కృషిచేశారు. భవన నిర్మాణానికి 7.5ఎకరాల తన సొంత భూమిని సైతం ఇచ్చారు. గ్రామంలో తాగునీటి పథకం ట్యాంకుల నిర్మాణానికి తన భూమినే ఇచ్చారు. పోలీసు స్టేషన్‌ భవన నిర్మాణానికి తోడ్పాడునందించారు. ఉండబండ వీరభద్ర స్వామి ఆలయానికి ఛైర్మన్‌గా వ్యవహరించడంతో పాటు, అభివృద్ధికి కృషి చేశారు. ఒక సారి తెదేపా తరఫున విడపనకల్లు జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి, మండల అభివృద్ధికి పాటుపడ్డారు.
*విడపనకల్లు మండలం ఉండబండ గ్రామ సర్పంచిగా నారాయణప్ప వరుసగా నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. అందులో మూడు సార్లు ఏకగ్రీవం కాగా, ఒకసారి పోటీలో నిలిచి గెలుపొందారు. ఆ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించి, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి కృషి చేశారు. గ్రామంలో వివిధ సదుపాయాల కల్పనకు పాటు పడ్డారు.

కొత్తగా మారిన పాతచెరువు

గుంతకల్లులోని పాతకొత్తచెరువు గ్రామానికి చెందిన గుంతా నారాయణశెట్టి 30 ఏళ్లు సర్పంచిగా కొనసాగారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినా.. ఏరోజూ కార్లు, జీపులు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించలేదు. బస్సులు, ఆటోల్లోనే ప్రయాణించే వారు. 2004 సంవత్సరం ఆటో ప్రమాదంలో మృతిచెందారు. నారాయణశెట్టి అంటే పాతకొత్తచెరువు గ్రామప్రజలకు ఎనలేని అభిమానం. రెండో నాయకుడి ప్రసక్తి లేకుండా 1995 వరకు ఆరు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రజల ఆశలను వమ్ము చేయకండా గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషిచేశారు. ఆ గ్రామం ప్రస్తుతం పట్టణంగా మారింది. గ్రామంలో ఆయన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చారు. పశువైద్య కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం, తాగునీటి పథకం, విద్యార్థుల కోసం సంక్షేమ వసతిగృహం, బ్యాంకు, సామాజిక భవన నిర్మాణం, గ్రామంలో సిమెంటు రోడ్ల నిర్మాణం, బీసీ కాలనీ ఏర్పాటు, బ్యాంకు ఏర్పాటు, పంచాయతీ భవన నిర్మాణం తదితర పనులను చేపట్టి పూర్తిచేశారు. ఇతనికి ఇద్దరు కుమారులు. వారు బెంగళూరు, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తరచుగా వారు గ్రామానికి వచ్చి విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తుంటారు. నారాయణశెట్టి భార్య లక్ష్మీదేవి హైదరాబాద్‌లో కుమారుడి వద్ద ఉంటున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలులో రెండో రోజు... 435 నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.