అనంతపురంలో సంజీవని బస్సులను ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ఒకేసారి పది మంది నుంచి కరోనా పరీక్షల నమూనాలు సేకరించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య మాట్లాడుతూ, కరోనాపై అనవసర ఆందోళ చెందవద్దనీ.. వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆర్టీసీ రూపొందించిన అధునాతన సంజీవని బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. బస్సులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను నేతలు పరిశీలించారు. జిల్లాలో టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు 24గంటల్లో ఫలితాలు వచ్చే విధంగా అధికారులు పని చేస్తున్నారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: 'కొవిడ్‌పై విజయం సాధించి తిరిగిరావడం సంతోషదాయకం'