అనంతపురం జిల్లా నేమకల్లులోని కంకర మిల్లులకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (చెన్నై ధర్మాసనం) రూ. 1.15 కోట్ల జరిమానా విధించింది. స్టోన్ క్రషర్ల వల్ల నేమకల్లు ప్రాంతం కాలుష్యమయం అవుతోందని హీరోజీరావు అనే వ్యక్తి 2018లో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన ఎన్జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్న 21 కంకర మిల్లులకు రూ 1.15 కోట్లు జరిమానా విధిస్తున్నామని స్పష్టం చేసింది. ఆ సొమ్ము రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వసూలు చేయాలని తీర్పులో పేర్కొంది. నిబంధనల మేరకు పని చేయని మిల్లులపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇదీ చదవండి:Chandrababu: గృహ నిర్మాణ రంగంపై సీఎం జగన్‌వి గాలి మాటలు: చంద్రబాబు