Rowdy sheeter murder: అనంతపురం జిల్లా ధర్మవరం ఇందిరమ్మ కాలనీ సమీపంలో.. రెడ్డిపల్లి హరిప్రసాద్ అనే రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు బండరాయితో తలపై మోది హతమార్చారు.
హత్యకు గురైన హరిప్రసాద్ పై రెండు హత్య కేసులు, మరో రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ధర్మవరానికి చెందిన మస్తాన్, షెకావలీ అనే యువకులతో.. హరి ప్రసాద్ కు పాత గొడవలున్నాయి.
హరి ప్రసాద్ తో గొడవ పడిన వీరు.. బండరాళ్లతో మోదీ చంపారని ధర్మవరం పట్టణ పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రమాకాంత్ పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:
8 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన వ్యక్తి అప్పగింత.. సంతోషంలో కుటుంబ సభ్యులు!