అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు గ్రామాలు అతలకుతలం అయ్యాయి. రహదారులు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మడకశిర మండలం పత్తికుంట గ్రామం నుంచి రాకపోకలు సాగించే ప్రధాన రహదారి తెగిపోయింది. జాట్రపల్లి, పత్తికుంట గ్రామాల మధ్య ఉన్న మట్టి రహదారి కోతకు గురైంది. జాట్రపల్లి గ్రామ విద్యార్థులు పాఠశాలకు పొలం గట్లపైనే నడుస్తూ,తీవ్ర అవస్ధలు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రస్తుతానికి తాత్కాలికంగానైనా సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి : ఉధృతంగా వేదవతి,హగరి నదులు ప్రవాహం