ROAD ACCIDENT: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి వద్ద ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ మృతి చెందాడు. మరో రైతు ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. మేడాపురం నుంచి ధర్మవరం కూరగాయల మార్కెట్కు ఆటోలో కూరగాయలు తీసుకువస్తుండగా పొగమంచుతో రహదారి కనిపించకపోవడంతో ఆటో అదుపుతప్పి కిందపడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ధర్మవరం గ్రామీణ పోలీసులు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి: