అనంతపురం జిల్లా గుత్తికి చెందిన కుటుంబ సభ్యులు.. కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురంలో బంధువుల ఇంటికి వెల్లి వస్తున్నారు. గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శునకం అడ్డుగా రావడంతో.. దాన్ని తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుత్తి ఎస్సీ కాలనీకి చెందిన 9మంది గాయపడగా.. రిషికా (6) మృతి చెందింది. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 5లక్షలకు చేరువలో కరోనా కేసులు