డివైడర్ను ఢీకొన్న కారు... ఒకరు మృతి - car hits dividor at ananthapur
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు డివైడర్ని ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అనంతపురంలో రోడ్డు ప్రమాదం