ETV Bharat / state

అనంతపురం జిల్లాలో రేషన్ పంపిణీ వాహనదారుల కష్టాలు

రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికి రేషన్‌ బియ్యం పథకం.. రేషన్ పంపిణీ వాహనదారులకు కష్టాలను కొనితెచ్చింది. వాహన డ్రైవర్ల సమస్యలు, పథకం లోటుపాట్లను అధికారులు సరిదిద్దకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాము ఈ పని చేయలేమని తేగేసి చెబుతున్నారు.

rice distribution drivers
రేషన్ పంపిణీ వాహనదారుల కష్టాలు
author img

By

Published : Apr 18, 2021, 5:30 PM IST

రేషన్ పంపిణీ వాహనదారుల కష్టాలు

అనంతపురం జిల్లాలో.. ఇంటింటికీ రేషన్ అందించే వాహన డ్రైవర్ల కష్టాలు తీర్చేవారే లేరు. ఉద్యోగంలో చేరేప్పుడు చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న పనికి అసలు పొంతనేలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వాహనం నడపడమేనని చెప్పి.. ఇప్పుడు అన్నీ పనులు తమతోనే చెయిస్తున్నారని వాపోతున్నారు. వేతనరూపంలో నెలకు 21 వేలు ఇస్తుండగా.. అందులో వాహనం కంతుగా 3వేలు మినహాయించి 18వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా.. అంతకన్నా ఎక్కువగానే మినహాయిస్తున్నారని డ్రైవర్లు తెలిపారు.

సరుకుల పంపిణీలో సమస్యలు..

జిల్లావ్యాప్తంగా ఇంటింటికి రేషన్ అందించేందుకు 755 వాహనాలను ఏర్పాటు చేయగా.. సరకుల పంపిణీలో తీవ్ర సమస్యలు, ఇతర కారణాలతో ఇప్పటికే చాలామంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం 582 రేషన్‌ వాహనాలు మాత్రమే ఇంటింటికి రేషన్ అందిస్తున్నాయి. వారిలో మరో 173 మంది సమస్యలు పరిష్కరించుకుంటే తామూ ఉద్యోగం మానేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

వాహనాలు వెనక్కిచ్చేసిన కొందరు..

అనంతపురం నగరంలో బియ్యం పంపిణీకి 173 వాహనాలు కేటాయించగా.. 3 నెలలు తిరక్కుండానే 44 వాహనాలు నిలిచిపోయాయి అంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇప్పటికే చాలా మంది వాహనాలు వెనక్కి ఇచ్చేశారు. అయితే ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. చాలాచోట్ల వాహనాల ద్వారా పంపిణీ నిలిచిపోయి కార్డుదారులు పాత పద్ధతిలోనే డీలర్ వద్దకు వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారు. అయితే సమస్యలు పరిష్కరిస్తే ఇంటింటికీ వెళ్లి సరకులు ఇచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వాహన డ్రైవర్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా.. పరిస్థితిలో మార్పు ఉండటం లేదని రేషన్ పంపిణీ వాహన డ్రైవర్లు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నాయకుల మధ్య ఆధిపత్య పోరు.. పలువురికి గాయాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.