అనంతపురం జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విడపనకల్, వజ్రకరూరు మండలాల్లో దాదాపు 9 వేల ఎకరాల్లోని మిరప పూర్తిగా కుళ్ళిపోయింది. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడి పెట్టి పండించిన పంట ఇలా మధ్యలోనే తెగుళ్లు సోకి చనిపోవడంతో ప్రభుత్వసాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు రైతులు. కర్షకులు పడుతున్న తీవ్ర ఆవేదనపై ఈటీవీ - ఈనాడు, ఈటీవీ భారత్ లలో వరుస కథనాలు ప్రసారం చేయడంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు.
క్షేత్ర స్థాయిలో వెళ్లి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈటీవీ జైకిసాన్ లో ప్రసారమైన నష్టం కొండంత - సాయం గోరంత కార్యక్రమాన్ని వీక్షించిన జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో విడపనకల్, వజ్రకరూరు మండలాల్లో దెబ్బతిన్న మిరప పంటలను పరిశీలించారు. నష్ట పోయిన రైతులను కలిసి వివరాలు తెలుసుకొన్నారు. పరిహారం అందేలా నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపుతామని భరోసా కల్పించారు. దెబ్బతిన్న మిరప పంటలను పూర్తిగా తొలగించి అందులో ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా అడుగులు వేయాలని రైతులకు సూచించారు.
ఇవీ చదవండి: