వ్యవసాయ శాఖలో మామూళ్ల దందాపై.. ఓ అధికారిణి ఆడియో సంభాషణలు ఈటీవీలో ప్రసారం కావడంపై వ్యవసాయ కమిషనర్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ వ్యవసాయ అధికారి రాజ్యలక్ష్మి వ్యవహారంపై విచారణ జరిపించాలని కమిషనర్ కార్యాలయం అధికారులను ఆదేశించారు. విచారణ తరువాత అవసరమైతే అక్కడి ఏడీఏ పద్మావతి పైనా తగిన చర్యలు తీసుకుంటామని జేడీఏ రామకృష్ణ స్పష్టం చేశారు.
ఎరువుల దుకాణాల యజమానులు వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఉన్న ఓ ఆడియో.. ఈటీవీలో ప్రసారం కాగా ఆ శాఖ జిల్లా అధికారులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా ఏడీఏ పద్మజను నియమించగా.. అనారోగ్య సమస్యల వల్ల తనవల్ల విచారణ కాదని అధికారులకు లేఖ పంపారు. వేరే అధికారిని విచారణకు నియమించటంలో జిల్లా అధికారులు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: