అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న కరోనా వీరులు ప్లాస్మాను ఇవ్వటానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 13 వేల మందికి పైగా నిర్ధరణ పరీక్షలు చేయించినట్లు కలెక్టర్ తెలిపారు. వీరి నుంచి తీసుకున్న ప్లాస్మాను ప్రస్తుతం కరోనా బారిన పడిన వారికి ఇవ్వడం ద్వారా వారు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ప్లాస్మా వితరణ చేసినవారికి ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమని ఎంపీ చెప్పారు. ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి. కరోనాను తరిమికొట్టే పని.. మొత్తం సమాజానిది