అనంతపురం జిల్లా రాయదుర్గం సచివాలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున... మహిళా కార్యదర్శులు, వార్డు వాలంటీర్లను లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులు రావటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదులపై స్పందించిన మహిళా కమిషన్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మల్లికార్జునపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: తుంగభద్ర ఎగువ కాలవకు సమాంతరంగా మరో కాలవ నిర్మాణం