అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో.. కో ఆప్షన్ సభ్యులు ఎంపిక ఏకగ్రీవమైంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పోరాళ్లు శిల్ప, ఇతర వార్డు సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సామాజిక న్యాయం పాటిస్తూ.. అన్ని వర్గాల వ్యక్తులనూ పదవులకు ఎంపిక చేసినట్లు రామచంద్రారెడ్డి తెలిపారు.
ఇద చదవండి: కొవిడ్ నుంచి కోలుకున్న 3నెలల తర్వాతే టీకా!
పదవులు దక్కిన వారిలో జనరల్, మైనారిటీలతో పాటు ఆటోడ్రైవర్ భార్య, ప్రైవేటు ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, అధికారపార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇద చదవండి: