అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మున్సిపాలిటీకి మాజీ మంత్రి, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ద్వారా 10 టన్నులు సోడియం హైపోక్లోరైట్ను పంపారు. అయితే దీనిని పట్టణ మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రరావు తిరస్కరించారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని దిగుమతి చేసుకోవడానికి సరైన ట్యాంకర్లు లేవని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ తీరుపై తెదేపా నాయకులు విమర్శలు గుప్పించారు. కలెక్టర్ అనుమతి ఇచ్చినా మున్సిపల్ అధికారులు తిరస్కరించటం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి