అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరింది. ఉరవకొండ పట్టణంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఐసీడీఎస్ కార్యాలయంలోకి వర్షపు నీళ్లు చొచ్చుకెళ్లాయి.
ఎన్నడూ లేనంతగా..
ఫలితంగా కార్యాలయ సిబ్బంది నీటిని బయటకు ఎత్తిపోశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అనంత జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల నివాసాలు కూలిపోయాయి.