అనంతపురం జిల్లా గాండ్లపెంటలో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఒక్కసారిగా చిరుజల్లులు పడ్డాయి. నిమిషాల వ్యవధిలోనే వీధులన్నీ జలమయమయ్యాయి. కదిరిలో అకస్మాత్తుగా వాన కురిసింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా... కర్నూలు జిల్లాలో వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. కర్నూలు నగరాన్ని సైతం చిరుజల్లులు పలకరించాయి. ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందారు.
ఇదీ చూడండి: