రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీకి.. రాజీనామా లేఖను పంపించారు. 2014 మార్చి 11న తనకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్పారని గుర్తు చేసుకున్న రఘువీరా.. అవకాశం ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. శక్తివంచన లేకుండా పార్టీ కోసం శ్రమించానని చెప్పారు. ఇతర నాయకుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఈ ఏడాది మే 19నే.. నాటి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపించానని చెప్పారు. ఇకపై పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేనని.. మరో ఆర్నెల్ల కంటే పార్టీకి సమయం కేటాయించలేనని స్పష్టం చేశారు. తన కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని కోరారు.
పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా - soniagandhi
పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి.. రాజీనామా చేశారు. మరో ఆర్నెల్ల కంటే ఎక్కువగా.. పార్టీకి సమయం కేటాయించలేనని చెప్పారు. రాజీనామాను ఆమోదించాలంటూ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీకి లేఖ రాశారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీకి.. రాజీనామా లేఖను పంపించారు. 2014 మార్చి 11న తనకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్పారని గుర్తు చేసుకున్న రఘువీరా.. అవకాశం ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. శక్తివంచన లేకుండా పార్టీ కోసం శ్రమించానని చెప్పారు. ఇతర నాయకుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఈ ఏడాది మే 19నే.. నాటి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపించానని చెప్పారు. ఇకపై పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేనని.. మరో ఆర్నెల్ల కంటే పార్టీకి సమయం కేటాయించలేనని స్పష్టం చేశారు. తన కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని కోరారు.
*హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా లా తాడిపత్రి మండలం వంగనూరు గ్రామ సమీపంలో హత్య కుట్రను పన్నుతున్న ఐదుగురిని గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భరంగా గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఓయస్డీ ఎంవీయస్.స్వామి ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో టెక్నికల్ ఆఫీసురుగా విధులు నిర్వహిస్తున్న నిషారుద్దీన్ అతని భార్య గౌసియాలు కుటుంబ కలహాల నేపథ్యంలో మూడు సంవత్సరాల క్రితం విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో గౌసియా తన భర్తను హత్య చేయిస్తే భర్త పెరు మీద ఉన్న ఇన్సూరెన్స్ రూ.14 లక్షలు వస్తుందని, ఉద్యోగం కూడా తనకే వస్తుందనే దురుద్దేశంతో హత్య చేయాలని అనుకుంది. ఇందులో భాగరంగా తనకు పరిచయం ఉన్న జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవిని సంప్రదించింది.. నిర్మలాదేవి తన భర్త కులశేఖర్, స్నేహితుడు గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన రమణారెడ్డి, తాడిపత్రికి చెందిన మురళి కృష్ణా రెడ్డి, నాగేంద్రలు కలిసి రూ.5 లక్షలకు ఒప్పందం తీసుకున్నారు. ఇందులో భాగంగా తాడిపత్రి మండలం వంగనూరు గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హత్యకు కుట్ర పన్నుతున్నట్లుగా గ్రామీణ సీఐ సురేష్ బాబుకు సమాచారం రావడంతో సీఐ, ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురిని అదుపు లోకి తీసుకుని విచారించగా నిజాలు బయటకు వచ్చినట్లుగా తెలిపారు. దీంతో వారి వద్ద నుంచి రూ.40 వేల నగదు, ఒక కొడవలి, పిడిబాకు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. నిందితులందరినీ రిమాండ్ కి తరలించామని పేర్కొన్నారు...
Body:ఎంవీయస్. స్వామి (అనంతపురం ఓయస్డీ)
Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598