విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలంటూ అనంతపురం జిల్లాలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దామంటూ.. రాయదుర్గంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...