కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఎస్ఎఫ్ఐ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి మోకాళ్ల పైన కూర్చుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశ రక్షణ విభాగంలో ఉద్యోగాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారని .. యథావిధిగా పాత పద్ధతుల్లోనే పరీక్షలు నిర్వహించి నియామకాలను చేయాలన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకోవాలని లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తిరుపతిలో.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ తిరుపతిలో విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుపతి రైల్వేస్టేషన్ ఎదుట బైఠాయించి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. స్టేషన్ ముందు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వినూత్నపద్దతిలో నిరసన చేపట్టారు. త్రివిధ దళాల్లో స్వల్పకాలిక ప్రతిపాదికన సైనికులను నియమిస్తామని చెప్పటం చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇది యువత ఆశలను నిరాశ పరిచే విధంగా ఉందని... దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వారికి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం చాలా బాధాకారం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: