అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీపై అధికారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కళ్యాణదుర్గం శివార్లలోని ముదిగల్లు రోడ్డుకు 11 ఎకరాల భూమిని తీసుకుని పేదలకు పంపిణీ చేసేందుకు ప్లాట్లు సిద్ధం చేశారు.
ఈ భూమిపై హక్కు తమకు ఉందని కొంతమంది అడ్డుపడ్డా అధికారులు వాటిని అధిగమించి ప్లాట్లు సిద్ధం చేశారు. ఈ భూమి తమకు హక్కు ఉందని తాజాగా కొంతమంది ట్రాక్టర్లతో వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. ఈ విషయం స్థానిక తహసీల్దార్ గోపాల్ రెడ్డిని అడగగా ఆ భూమి కొనుగోలు చేశామని హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
ఇదీ చూడండి