ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం - ధర్మవరం నేర వార్తలు

కరోనా ప్రభావంతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

Private teacher commits suicide with financial difficulties in dharamavaram ananthapuram district
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Aug 25, 2020, 6:23 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో నాగప్ప ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి లాక్​డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటినుంచి ఉపాధి లేక, ఇతర పనులు దొరకక మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆధార్ ముఠా....ప్రభుత్వ పథకాల కోసం కార్డుల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.