అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఓ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ఆ పాఠశాల కమిటీ ఛైర్మన్ నుంచి వస్తున్న బెదిరింపులపై ప్రధానోపాధ్యాయుడు చేసిన ఫిర్యాదు ఇలా ఉంది...
'‘ప్రతి పనికీ అధిక మొత్తంలో బిల్లులు రాయాలని ఒత్తిడి చేస్తున్నారు. చెక్కులపై సంతకం చేయకుండా నన్ను బాగా వేధిస్తున్నారు. నా ప్రాణానికి ప్రమాదముంది. ఇకపై నేను ఎంత మాత్రం పనులు చేయించలేను. నాడు-నేడు పనుల నుంచి నన్ను తప్పించాలని వేడుకుంటున్నా. ప్రజాప్రతినిధుల నుంచి విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు’' అంటూ వాపోయారు. దీనిపై డీఈఓ శామ్యూల్‌ను వివరణ కోరగా... ‘'ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేయడం వాస్తవమే. దీనిపై విచారించి, తగిన చర్యలు తీసుకుంటాం. నాడు-నేడు పనుల్లో ఎవరూ ఇబ్బంది పడకుండా, ప్రశాంతంగా పనిచేయించే బాధ్యత మాపై ఉంది’' అన్నారు.
ఇవీ చదవండి..