ETV Bharat / state

సమయానికి సరైన వైద్యం అందక.. గర్భిణి కన్నుమూత - death

మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సరైన వైద్య సేవలు అందక గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు తరచూ మరణిస్తున్నారు. సరైన వైద్య సేవలు అందక అనంతపురం జిల్లాలో గర్భిణి మృతి చెందింది.

గాళమ్మ(ఫైల్ ఫొటో)
author img

By

Published : Jul 7, 2019, 9:41 PM IST

అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎన్.అనుమాపురం గ్రామానికి చెందిన గాళమ్మ (38)కు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబం అయినందున కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. 9 నెలల గర్భవతి అయిన గాళమ్మకు ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు తరలించగా... వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యానికి అనంతపురం తరలించాలని సూచించారు. అంతలోనే ఆమె కన్నుమూసింది. గాళమ్మకు ఇది రెండవ కాన్పు కాగా.. కొద్ది రోజులుగా ఆమె రక్తహీనతతో బాధ పడుతోంది. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్లే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా సొంత జిల్లాలో లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప జిల్లా ఇడుపులపాయలోని ఈనెల 8 ఇడుపులపాయలోని వైయస్సార్ జయంతి సందర్భంగా చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల పూర్తయ్యాయి ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పిస్తారు సమాధి వద్ద అ బారికేడ్లను ఏర్పాటు చేశారు. తర్వాత గండి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత గండి లో జరిగే అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇడుపులపాయ చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్ లో jammalamadugu వెళ్లనున్నారు . జమ్మలమడుగులో ఏర్పాటుచేసిన ప్రాంగణానికి చేరుకునీ రైతు దినోత్సవం లో పాల్గొంటారు . ఇప్పటికే పర్యటన ఏర్పాటును బిజీ బిజీగా ఉన్న కలెక్టర్ కిరణ్ ఉన్నత అధికారులు ఎక్కడ అ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేసిన జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.