ETV Bharat / state

రోడ్డుపైనే పీపీఈ కిట్లు.. ప్రాణాలతో చెలగాటం

కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచానికి పొంచి వున్న మరో సవాల్​ ఆకలి చావులని అందరూ అనుకుంటున్న తరుణంలో.. మరో విపత్తు ప్రపంచానికి పెను సవాల్​ విసురుతోంది.. అవే పీపీఈ కిట్లు. కరోనా పరీక్షలు నిమిత్తం విరివిగా వాడుతున్న వీటిని.. వైద్యులు ఎక్కడబడితే అక్కడే పడేస్తున్నారు. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యర్థాలతో మరో తలనొప్పి మొదలు కానుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నప్పటికీ తరుచుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం భయాందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.

PPE kits waste on the road
రోడ్డుపైనే పీపీఈ కిట్ల వ్యర్థాలు
author img

By

Published : Jul 27, 2020, 12:44 AM IST

జనం ఒకవైపు కరోనాతో భయపడుతుంటే మరోవైపు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్​ పరీక్షలు చేసేందుకు వినియోగించిన పీపీఈ కిట్లు, చేతి గ్లౌజులు పరీక్షలు అనంతరం అదే ప్రాంతంలో వదిలేసి వెళ్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 24న కొవిడ్ పరీక్షలు జరిపారు. అనంతరం వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లారు. వాటిని మున్సిపల్ యంత్రాంగం డంపింగ్ యార్డుకు చేర్చాల్సి ఉండగా.. వారు పట్టించుకోకపోవడం పాఠశాల ఆవరణలోనే వ్యర్థాలు పడి ఉన్నాయి. దీంతో పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు ఆవరణలోకి రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. కొవిడ్​ పరీక్షల అనంతరం వ్యర్థాలను తొలగించి కీటకనాశిని పిచికారి చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా వ్యర్థాలు పాఠశాల ఆవరణలోనే పడేయటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి...

కరోనా ఎఫెక్ట్: జిల్లాలో 36 గంటలపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.