అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని లత్తవరం గ్రామ సమీపంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. తహసీల్దార్ వాణిశ్రీ, SI ధరణి బాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 70 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బియ్యాన్ని సీజ్ చేసి స్టాక్ పాయింట్ కు తరలించారు.
ఇదీ చదవండి: మా ఊరికి రావొద్దంటూ.. డప్పుకొట్టి చెబుతున్నఅక్కడి గ్రామస్థులు