అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్దతండ సర్పంచి పదవి ఏకగ్రీవం అయింది. తుమ్మలబైలు పెద్దతండ నుంచి నలుగురు అభ్యర్థులు సర్పంచి పదవికి పోటీ పడ్డారు. వైకాపా మద్ధతుదారులుగా రవి నాయక్, కళావతమ్మ, హనుమంతునాయక్ నామినేషన్లు వేశారు. తెదేపాకు మద్ధతుతో కృష్ణా నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.
సర్పంచి పదవి కోసం పోటీ పడిన అందరూ సమీప బంధువులే అని అధికార పార్టీ నాయకులు తెలుసుకున్నారు. తెదేపా మద్ధతుదారు కృష్ణా నాయక్తో పాటు.. వైకాపా మద్ధతుదారుగా నామినేషన్లు వేసిన కళావతమ్మ హనుమంతు నాయక్లపై బంధుత్వాన్ని ఎరగా చూపుతూ.. ముగ్గురు అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకొచ్చారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థులు అందుబాటులో లేకుండా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు