కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించిన రోడ్లపైకి వచ్చే వాహనదారులపై అనంత పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. సాయంత్రం ఆరు తర్వాత బయటకు వచ్చే వాహనాలను ఎక్కడికక్కడే ఆపేసి జరిమానాలు విధించారు. రోడ్లపైకి అనవసరంగా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.
ఇదీచదవండి