..
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత - రంగాపురంలో కర్ణాటక మద్యం పాకెట్స్ పట్టివేత
అనంతపురం జిల్లా రంగాపురంలో కారులో తరలిస్తున్న 384 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడ్డాయి. మడకశిర నియోజకవర్గంలోని రోళ్ళ మండలం రంగాపురం గేటు వద్ద ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారుల సోదాలు నిర్వహించారు. అగలి మండలానికి చెందిన రామేగౌడ్ అనే వ్యక్తి కారులో 384 కర్ణాటక మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక మద్యం పాకెట్స్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
..