అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం వీరాపురంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కర్ణాటక మద్యం పట్టుబడింది. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వైవీ పవన్ తెలిపారు.
రాయదుర్గం, కనేకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 12 వరకు నమోదైన 50 కేసుల్లో.. 80 మందిని అరెస్ట్ చేశారు. 34 వాహనాలను సీజ్ చేసి 255 లీటర్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి..