అనంతపురం జిల్లా సోమందేపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ధర్మవరం నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 240 చౌక బియ్యం బస్తాలను పట్టుకున్నారు. ఈచర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ధర్మవరంలో శివ అనే చౌక ధాన్యపు డిపో యజమాని ఈ బియ్యం బస్తాలను కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నాడని ఐచర్ వాహన డ్రైవర్, క్లీనర్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. డిపో యజమాని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద 192 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని సోమందేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలించే వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారని.. వారిని కూడా పట్టుకుంటామని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా వివరించారు.
ఇదీ చూడండి. NTR Jayanthi: 'తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్'