ETV Bharat / state

చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో.. ఆ తర్వాత​ అదృశ్యం

కుటుంబ సమస్యల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యామాల్లో పెట్టి అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా వారు రంగంలోకి దిగి అతని ఆచూకీ కనిపెట్టారు. అతనిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో జరిగింది.

author img

By

Published : Aug 25, 2021, 9:43 PM IST

suicide attempt
suicide attempt

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన రమేశ్​ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఓ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్, ఫేస్​బుక్​ లో ఉంచాడు. అనంతరం తన ఫోన్ స్విచ్చాఫ్​ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్రమత్తం అయిన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం పోలీసులకు తెలియజేశారు.

వెంటనే స్పందించిన పోలీసులు...

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న సాయంత్రం నుంచి రమేశ్​ ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. అతడిని కనిపెట్టేందుకు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతను బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట రిజర్వ్ ఫారెస్ట్​లో ఉన్నట్లు గుర్తించారు. అతడు పురుగుల మందు తాగినట్లు, ఎక్కువ మోతాదులో రకరకాల టాబ్లెట్లు వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జేసీబీ డ్రైవర్​గా పనిచేస్తున్న బాధితుడు చెడు అలవాట్లకు బానిసయ్యాడని.. కుటుంబ సభ్యులు మందలించడంతో ఇలా చేశాడని తెలిపారు.

ఇదీ చదవండి:

అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించాం: వెంకట్రామిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.