కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి చనిపోవాలనుకున్నాడు. అనంతపురం ప్రశాంతినగర్‌కు చెందిన అతను రైలు కింద పడి చనిపోవాలని వడియంపేట రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అతని సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. జిల్లా నాలుగో టౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు.. సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకున్న వ్యక్తి చరవాణి నంబర్ సేకరించి.. ఫోన్లోనే కౌన్సిలింగ్ చేశారు. అతని ప్రయత్నం విరమించుకునేలా విజయవంతం అయ్యారు. తర్వాత ఆ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి.. కుటుంబీకులకు అప్పగించారు. సమయానికి స్పందించి తగిన చర్యలు తీసుకున్నందుకు సీఐని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అభినందించారు.
ఇదీ చదవండి: