ETV Bharat / state

'రంజాన్ ప్రార్థనలు ఇళ్ల వద్దే చేసుకోండి'

author img

By

Published : Apr 23, 2020, 7:23 PM IST

లాక్​డౌన్​కు ముస్లిం సోదరులు సహకరించాలని, రంజాన్ ప్రార్థనలు ఇళ్ల వద్దనే చేసుకోవాలని ఉరవకొండ సీఐ, తహసీల్దార్ కోరారు.

police responds on ramjan celebrations
రంజాన్ ప్రార్థనలపై పోలీసు అధికారుల సూచనలు

రంజాన్ దృష్ట్యా అనంతపురం జిల్లా ఉరవకొండలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ముస్లిం మత పెద్దలతో పోలీసు, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఇళ్ల వద్దే రంజాన్ ప్రార్థనలు చేయాలని సీఐ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ప్రభుత్వ వైద్యాధికారి కోరారు. ప్రతి మసీదులో ఇమామ్, మౌజన్​తో పాటు మరో ముగ్గురికి అనుమతితో అజాన్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. అనంతరం ముస్లింలకు పోలీసులు మిఠాయిలు ఇచ్చారు.

ఇదీ చూడండి:

కళ్యాణదుర్గంలో నాటుసారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.