ETV Bharat / state

అనంతలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్టు

అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దవడుగూరు మండలాల్లో అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. తాడిపత్రిలో ముగ్గురిని, పెద్దవడుగూరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

police raids on illegal liquor in ananthapur district
అనంతపురంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్టు
author img

By

Published : Aug 31, 2020, 5:58 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న ఇద్దురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రికి చెందిన తండ్రి కొడుకులు పేరం రామచంద్రారెడ్డి, పేరం శ్రీనివాసరెడ్డిలు... ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మద్యం షాపులో మద్యం సీసాలు కొనుగోలు చేసి రాత్రి సమయాల్లో ఇతరులకు అధిక ధరలకు విక్రయించేవారు. పోలీసుల దాడుల్లో వీరిద్దరితో పాటు మద్యం దుకాణం సేల్స్ మెన్ పై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

పెద్దవడుగూరులో..
పెద్దవడుగూరు మండలం వెంకటంపల్లి మలుపు వద్ద... ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో నాటుసారాను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 200 లీటర్ల నాటుసారా, 4 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్ చేసి నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

కొవిడ్ ఆసుపత్రికి ఔషధాలు, పరికరాలు అందించిన బాలకృష్ణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.