ETV Bharat / state

తండ్రి లైంగిక వేధింపులు.. ఆ అమ్మాయి ఏం చేసిందంటే..! - స్త్రీ శిశు సంక్షేమ శాఖ

POCSO Case Against the Father: కన్న కూతురిపైనే ఓ తండ్రి కన్నేశాడు.. ప్రతిరోజు మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తల్లి, కూతుర్ని చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆ తండ్రి చేసే అకృత్యాలు భరించలేని ఆ అమ్మాయి అనంతపురంలో ఉన్న తన సోదరి సహాయంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు పిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

pocso case
pocso cas against the father
author img

By

Published : Nov 18, 2022, 8:17 PM IST

Police have registered a pocso case against the father: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి మద్యం మత్తులో కన్న కూతురుపైనే కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఓ కిరాణా షాపులో పని చేసే వ్యక్తి నిత్యం మద్యం సేవించి కట్టుకున్న భార్య ఎదురుగా.. కన్న కూతురుపట్ల అసభ్యకరంగా ప్రవరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కొంతకాలంగా మానసిక వేదన అనుభవించింది ఆ అమ్మాయి. తనకు వరుసకు అక్క ఆయిన ఓ మహిళ సహాయంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​కు సమాచారం అందించింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు వెంటనే జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు సమాచారం అందించారు.

ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఉరవకొండ పట్టణానికి చేరుకున్న అధికారులు అమె నుంచి మొత్తం విషయాలు సేకరించారు. ఘటన జరిగినది వాస్తవమేనని తేలడంతో.. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ... కన్న కూతురు పైనే తన కళ్ళ ఎదురుగానే అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. తప్పని అడ్డుకుంటే తీవ్రంగా కొట్టేవాడని.. చాకుతో పొడుస్తానని బెదిరించేవాడని వాపోయింది. గతంలో తాము వేరే గ్రామంలో నివాసం ఉన్న సమయంలో పెద్ద కూతురుతో కూడా ఇలాగే ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది. వీరి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.