అనంతపురం జిల్లా పరిధిలో కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను విడపనకల్, డోనేకల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా మద్యం అక్రమంగా తరలిస్తే ఊరుకునేది లేదని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: