ETV Bharat / state

అనంతపురం జిల్లాలో పోలీసుల కార్డెన్ సర్చ్ - అనంతపురం జిల్లాలో అక్రమమద్యం

అనంతపురం జిల్లాలో ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కర్ణాటక మద్యం, నాటు సారా తయారీ, విక్రయాలపై నిఘా వేసి తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు బృందాలుగా ఏర్పడి తండా గ్రామాలు, అటవీ ప్రాంతాలు, అనుమానితుల ఇళ్లు, గడ్డి వాములు, పశవుల పాకలు, దుకాణాలు, పొలాలు, కర్నాటక సరిహద్దు రహదారులు, గ్రామాలు, తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.

Police cordon search in Anantapur district
అనంతపురం జిల్లాలో పోలీసుల కార్డెన్ సర్చ్
author img

By

Published : Nov 29, 2020, 3:48 PM IST

అనంతపురం జిల్లా ఎన్పీకుంట పోలీసులు ఏన్​జీపీ తండా పరిసరాలలో కార్డెన్​ సెర్చ్​ నిర్వహించారు. 200 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీలో వినియోగించే తుమ్మ చెక్క ఒక బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో మద్యం అమ్మకం, సారా తయారీ వంటి కార్యక్రమాలు చేపడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని నంబుల పూలకుంట, అమడగూరు, ముదిగుబ్బ ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు తనిఖీలు నిర్వహించి.. సారా ఊటను ధ్వంసం చేశారు. నంబుల పూలకుంట మండలం నల్లగుంట్ల పల్లితండాపరిసరాలలో దాడులు చేసి .. 200 లీటర్ల ఊటను, తుమ్మ చెక్కను స్వాధీనం చేసుకున్నారు.

ఆమడగూరు పోలీసులు మహమ్మదాబాద్​లో తనిఖీచేసి 120 కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ముదిగుబ్బ పోలీసులు గరుగుతాండా పరిసరాలలో 150లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. సారాను తయారుచేయొద్దని స్థానికులకు తెలిపారు.

ఇదీ చూడండి.

అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు:ఎస్పీ విశాల్ గున్నీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.