ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుడు, విక్రేత గ్లెన్బ్రిగ్స్ ఇంటిపై మరోసారి అధికారులు దాడులు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అతని నివాసంలో ఉదయం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు.
నకిలీ ధ్రువపత్రాలు లభ్యం
ఈ సోదాల్లో నకిలీ ధ్రువపత్రాలు, మద్యం సీసాలు లభ్యమయ్యాయి. అధికారులు వీటిని సీజ్ చేసి జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు. ఈ ధ్రువపత్రాలు ఎవరికోసం తయారు చేశారు, ఏ విద్యా శాఖకు సంబంధించినవి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ పత్రాలతో లబ్ది పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి వివరాలు సేకరించి వారిని విధుల నుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: