కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మద్యం ఏపీలోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పెనుకొండ డీఎస్పీ మహబూబ్బాషా స్పష్టం చేశారు. బుధవారం పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమ మద్యంపై మండల వ్యాప్తంగా పలు చోట్ల విస్తృత తనిఖీలు చేశారు. చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 797 కర్ణాటక మద్యం పాకెట్లు, 73 మద్యం సీసాలు చిక్కినట్టు చెప్పారు. వీటికి సంబంధించి 12 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు వివరించారు. వీరి వద్ద నుంచి ఐదు ద్విచక్రవాహనాలు, రెండు ఆటో స్వాధీనం చేసుకున్నారు. మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లును అభినందించారు.
ఇదీ చదవండి :