అనంతపురం జిల్లాలో మహిళల భద్రత కోసం పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలపై నేరాలు జరగకుండా, వేధింపులకు గురికాకుండా మహిళా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలపై వెళ్లి విద్యా సంస్థలు, హాస్టళ్లు, ఆర్టీసీ బస్టాండ్ , రైల్వే స్టేషన్ , తదితర ప్రాంతాలకు వెళ్లి నిఘాతో అవగాహన కల్పిస్తున్నారు.
అమ్మాయిలతో ముఖాముఖి మాట్లాడారు. ఇంటా బయట సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని ఫోన్ నంబర్లు ఇచ్చారు. వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో కలిసి... ముందస్తు జాగ్రత్తలపై అమ్మాయిల్లో చైతన్యం తెస్తున్నారు.
ఇదీ చూడండి: