మాస్కు ధరించకుండా బయట తిరిగే వారికి పోలీసులు పురపాలక అధికారులు సంయుక్తంగా జరిమానా విధించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండు శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్, గాంధీనగర్ కూడలిల్లో మాస్కు ధరించకుండా రహదారిపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానా వేశారు. కరోనా కట్టడి కావాలంటే ఇళ్ల నుంచి బయటకు వచ్చే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పట్టణ సీఐ కరుణాకర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి...