ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ను ఆదుకోవాలని కోరుతూ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కరోనా కారణంగా.. దాదాపు ఐదు నెలలుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధిస్తున్నాయని.., వేతనాలు అడిగితే తొలగిస్తున్నారని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా... చైర్మన్ జస్టిస్ కాంతారావు స్పందించారని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న వారందరికీ వేతనాలివ్వాలని... అన్యాయంగా ఎవరిని తొలగించకూడదని అన్ని జిల్లా విద్యాధికారులకు, ప్రైవేట్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు..
అయితే మార్చి నుంచి వేతనాలు ఇవ్వకపోగా తొలగింపులు సైతం ఆపలేదని..., ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రైవేట్ టీచర్స్ ఆర్థిక సమస్యలకు, మానసిక ఒత్తిడికి గురై జిల్లాలో ఆరుగురు, వివిధ కారణాలతో రాష్ట్రంలో సుమారు 20మంది పైగా చనిపోయారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు వాపోయారు. సీఎం జగన్ తమను ఆదుకొని...కరోనా భృతిగా లాక్డౌన్ పీరియడ్ కాలంలో నెలకు రూ.10వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: 'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'