ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామం వద్ద... రోడ్డు విస్తరణ పనుల మార్జిన్ లో పడి వ్యక్తి మృతి చెందాడు. మారెడ్డిపాలెంకు చెందిన కొండా హనుమంతరావు(38)... తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి గోతిలో పడి హనుమంతరావు అక్కడికక్కడే మృతిచెందగా... వెనుక ఉన్న అంజయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి