ETV Bharat / state

'గ్రానైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి' - pilligundla granite mining news

అనంతపురం జిల్లా పిల్లిగుండ్ల గ్రామంలో గ్రానైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. క్వారీలో జరుగుతున్న పనులను వెంటనే ఆపాలంటూ మూగజీవాలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్వారీ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.

గ్రానైట్ తవ్వకాలను నిలివేయాలంటూ ఆందోళన చేపట్టిన పిల్లిగుండ్ల గ్రామస్థులు

author img

By

Published : Mar 2, 2020, 8:01 AM IST

గ్రానైట్ తవ్వకాలను నిలివేయాలంటూ ఆందోళన చేపట్టిన పిల్లిగుండ్ల గ్రామస్థులు

క్వారీలో జరుగుతున్న పనులను వెంటనే ఆపాలని గ్రామస్థులంతా మూగజీవాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామంలో గత కొంతకాలంగా ప్రభుత్వ అనుమతులతో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థులంతా కలిసి మూగజీవాలను క్వారీలోకి తీసుకెళ్లారు. గ్రానైట్ తవ్వకాలు ఆపాలని నినాదాలు చేశారు. తవ్వకం జరుగుతున్న ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అడుగంటి బోరు బావుల్లో తాగడానికి, వ్యవసాయానికి, మూగజీవాలకు నీరు లేక తీవ్ర కరవు ఏర్పడే పరిస్థితి ఉందంటూ వాపోయారు. గ్రానైట్ తవ్వకాల వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వెంటనే క్వారీ పనులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: 'గ్రానైట్ అక్రమార్కులపై కేసులు పెడతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.