అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఆధార్ కార్డు మార్పులు చేర్పుల కోసం వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలో ఎస్బీఐ ప్రధాన శాఖలో, తపాలా కార్యాలయంలో ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. చాలా రోజులుగా ఎస్బీఐలోని ఆధార్ కేంద్రం మాత్రమే పని చేస్తోంది. దీంతో స్థానిక ప్రజలే కాకుండా ఇతర మండలాలకు చెందినవారు వందల సంఖ్యలో అక్కడకు వస్తున్నారు. రోజుకు 40 మందికి మించి వివరాలు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిమిత సంఖ్యలో టోకెన్లు జారీ చేయటంతో వేచి చూడాల్సి వస్తుందని ప్రజలు నిరాశకు గురవుతున్నారు. తపాలా కార్యాలయంలోని కేంద్రాన్ని అధికారులు వెంటనే ప్రారంభించాలని జనం కోరుతున్నారు.
ఇదీ చదవండి: మండుటెండలో నిరసన జ్వాల.. వెనుదిరిగిన పోలీసులు