ETV Bharat / state

ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేయాలని ఆందోళన - అనంతపురం జిల్లాలో ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చెయ్యాలని ఆందోళన వార్తలు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ప్రజలు ఆందోళన చేశారు. జగనన్న చేయూత పథకం ద్వారా అర్హులైన మహిళలకు 18 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్​లో జమ చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కావాలని నిబంధనలు పెట్టారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు మరో నాలుగైదు రోజులు మాత్రమే ఉండటం.. ప్రజలు ఆందోళన చేపట్టారు.

people protest for link phone number to Aadhaar card
ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చెయ్యాలని రోడ్డుపై బైఠాయింపు
author img

By

Published : May 24, 2021, 2:33 PM IST

రాయదుర్గం బిఎస్​ఎన్​ఎల్​ కార్యాలయం వద్ద గత కొద్ది రోజులుగా ఆధార్​కు ఫోన్​ నెంబర్ లింకు చేస్తున్నారు. రోజు బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వచ్చి అధికారులు లేకపోవటంతో వెనుదిరిగి వెళ్తున్న జనం.. ఈరోజు కూడా కార్యాలయం వద్ద అధికారులు లేకపోవటంతో ఆందోళనకు దిగారు. జగనన్న చేయూత పథకానికి దరఖాుస్తు చేసుకునేందుక.. మరో నాలుగైదు రోజులు మాత్రమే ఉండటంతో ప్రజలు ఆందోళన చేపట్టారు.

అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాయదుర్గం ఎస్సై రాఘవేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిఎస్ఎన్ఎల్ అధికారులతో మాట్లాడిన ఎస్​ఐ.. కార్యాలయంలో ఉన్నతాధికారికి కరోనా సోకటంతో అధికారులు సెలవుపై వెళ్లారని వివరించారు.

అధికారులు వచ్చిన అనంతరం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకు చేస్తామని పోలీసులు సర్దిచెప్పి.. ఆందోళనకారులను తిరిగి పంపించారు. ప్రభుత్వం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకై ఉండాలన్న నిబంధనలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

కరోనా వేళ.. ఆలయాలు వెలవెల.. అర్చకులు విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.